💥తెలంగాణ లో వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ త్వరలో..💥
👉తెలంగాణాలో వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి.
👉వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు భర్తీ చేయడా నికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయ్యాయి.
👉దీంతో వాటన్ని టినీ భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
👉అలాగే ఖాళీలను ప్రతి 6నెలలు లేదా ఏడాదికో సారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది.
👉గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు.
👉మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
👉ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే, మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
👉6 నెలలుగా వైద్య, ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేసింది. ప్రజల్లో భరోసా నింపింది. వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కోవిడ్ సందర్భంగా ఏర్పడింది.
👉రానున్న కాలంలో ఆయా సదుపాయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
👉ఆరేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖ అనేక విజయాలు సాధించింది. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం మొదలు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
👉ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయి. వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
👉ఎక్కువగా కరోనా వల్లే హోస్పిటల్స్ కు ప్రజలు వెళ్లినట్లు తెలుస్తుంది.
👉ట్రైల్స్ లో వున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
👉వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు.
👉తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈటల మాట్లాడారు.
👉వైద్యశాఖపై ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇవ్వనుందని చెప్పారు.
👉 'సబ్ సెంటర్ల స్థానంలో వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేస్తాం.
👉 ఆరోగ్య శ్రీ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఖర్చు చేస్తుంది.
👉ఆరోగ్యశ్రీలోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స కోసం రూ.30 లక్షల ఖర్చవుతుంది.
👉వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.
👉ఇప్పటికీ రూ.40 కోట్లు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించాం. కేన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
👉ఆరోగ్యశ్రీపైనా సీఎంకు ఉపసంఘం ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది.
👉తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తాం. నవజాత శిశువుల మరణాల రేటు 39 నుంచి 27కి తగ్గింది.
👉మాతృత్వపు మరణాల రేటు 92 నుంచి 63కు తగ్గింది. ఇది దేశంలోనే రికార్డు.. సీజనల్ వ్యాధులు తగ్గడం మిషన్ భగీరథ పథకం సాధించిన విజయం.
👉మలేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది'అని ఈటల వెల్లడించారు.
🙏🙏🙏🙏🙏🙏
Social Plugin