💥ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే.
👉గ్రాట్యుటీ కాలపరిమితిని ఐదేళ్ల పాటు కాకుండా ఒక సంవత్సరానికి తగ్గించే బిల్లు పార్లమెంట్‌కు చేరింది.
👉అంటే ఇకపై ఒక సంవత్సరం పాటు పనిచేసినా గ్రాట్యుటీ చెల్లిస్తారు.
👉 కార్మిక చట్టాలకు సంబంధించి మూడు బిల్లులను కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
👉అందులో ఆక్యుపేషనల్ సేఫ్టీ,హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020, ఇండ్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఉన్నాయి.
👉సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్లులో పలు ప్రొవిజన్స్ జోడించారు. వాటిలో ఒక దానిలో గ్రాట్యుటీ గురించి ప్రస్తావించారు.
👉గ్రాట్యుటీ ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే చెల్లించాలని అందులో పొందుపరిచారు సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని కొత్త ప్రొవిజన్స్ ప్రకారం ..
👉ఇకపై ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ లభిస్తుంది.
👉అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక సంస్థలో కనీసం ఏడాది పాటు పనిచేస్తే చాలు గ్రాట్యుటీ అందుతుంది.
👉 సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోక్‌సభ, రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది.
👉ఆ తర్వాత చట్టరూపం దాల్చుతుంది. అప్పుడే గ్రాట్యుటీ నియమ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
💥గ్రాట్యుటీ అంటే ఏంటి?
👉 ఒక కంపెనీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఉద్యోగికి వేతనం, పెన్షన్, పీఎఫ్‌తో పాటు గ్రాట్యుటీ చెల్లిస్తారు.
👉 ఇన్నాళ్లు తమ కంపెనీకి అందించిన సేవలకు గాను ఉద్యోగికి సంస్థ ఇచ్చే రివార్డ్ అన్న మాట.
👉గ్రాట్యుటీ కోసం ఉద్యోగి జీతం నుంచి స్వల్ప మొత్తాన్ని తగ్గిస్తారు. ఎక్కువ మొత్తం మాత్రం కంపెనీయే చెల్లిస్తుంది.
Social Plugin