Hot Posts

6/recent/ticker-posts

పుట్ట గొడుగులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

💥పుట్ట గొడుగులు తింటే ఎన్ని లాభాలో తెలుసా? 


👉ఇతర కూరగాయలతో పోలిస్తే పుట్ట గొడుగులు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అలాగని కొనటం మానివేయకండి. ఎందుకంటే. వీటిలో పోషకాలు ఎక్కువ. నలబైకి పైబడిన మహిళలు మాంసాహారానికి బదులుగా ఒక కప్పు మష్రుమ్స్ తింటే చాలా మేలు జరుగుతుంది.

👉తరచూ మష్రుమ్స్ తినటం వలన శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది. రోగ నిరోధకశక్తి వృద్ది చెందుతుంది.

👉వీటిల్లో విటమిన్ బి సమృద్దిగా ఉంటుంది. రిబో ఫ్లేవిన్,నియాసిన్ వంటి పోషకాలు అందాలంటే వీటిని తప్పకుండా తినాలి.

👉రిబో ఫ్లేవిన్ ఎర్ర రక్త కణాలను పెరిగేలా చేస్తుంది. నియాసిన్ చర్మానికి మేలు చేస్తుంది.

 👉జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

👉పుట్టగొడుగుల్లో ఉండే ఖనిజాలు నాడి వ్యవస్థను దృడంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తుంది.

👉దాంతో పాటు హార్మోన్ల అసమానతలను తగ్గిస్తుంది.

👉వీటిలో లభించే సెలీనియం యాంటిఆక్సి డెంట్ లా పనిచేస్తుంది.

👉శరీరంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాల వృద్దికి సహాయపడుతుంది.

👉మష్రుమ్స్ లో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణ వాయువును అందేలా చేస్తుంది.

 👉అలాగే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

👉మష్రుమ్స్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది.

👉కండరాలను ఉత్తేజితం చేస్తుంది.

👉బరువు తగ్గాలని అనుకునే వారు వీటికి ప్రాదాన్యత ఇవ్వాలి. దీనిలో కేలరీలు,కొవ్వు తక్కువగా ఉంటాయి.

👉వీటిని తింటే శరీరానికి శక్తి మాత్రమే వస్తుంది. వీటిని కూరల్లో తినటానికి ఇష్టపడకపోతే సూప్ లో వేసుకొని తినవచ్చు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏