👉కరోనా అనేది ఒక శ్వాసకోశ వ్యాధి.
👉దీనిని ఈజీగా తీసుకోవడం మంచిది కాదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకూ జాగ్రత్తలు పాటించాలి.
👉దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కు, నోటి ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది.
👉సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ వ్యాధి అనేక మందికి వ్యాపిస్తుంది. కోవిడ్ పై పోరాడి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఉత్తమమైన, అనుకూలమైన ఆయుధం మాస్కును ధరించడం.
👉మాస్కు కూడా సరైన సమయంలో సరైన విధంగా ధరించడం అవసరం. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన కొత్త అలవాటు, జపించాల్సిన కొత్త మంత్రం 'మాస్కే కవచం'.
👉 కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమ శాఖ 'మాస్కే కవచం' పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయనుంది.
👉కోవిడ్-19 వైరస్ అప్రమత్తంగా లేని ఎవరి మీదైనా దాడి చేయవచ్చు. ఈ వైరస్ మన స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులు లేదా అపరిచితులు ఇలా ఎవరి దగ్గర నుండైనా రావచ్చు.
👉*మాస్కు వేసుకోకుండా బయటకు వెళ్లడం అంటే కరోనా వైరస్ ను ఇంటికి ఆహ్వానించడమే అవుతుంది. ఇంటి గడప దాటి బయటకు వెళ్లిన ప్రతిఒక్కరూ మాస్కు సరిగా వేసుకుంటే కోవిడ్ వ్యాప్తిని మనం చాలా వరకు ఆపవచ్చు.
👉ప్రస్తుతం ఇదే మన ముందున్న ఉత్తమమైన ప్రత్యామ్నాయం. మాస్కు వాడడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని, సంక్రమణను రెండు రకాలుగా అడ్డుకోవచ్చు. మొదటగా ఎవరిలోనైనా కరోనా వైరస్ ఉంటే వారి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తించకుండా మాస్కు ఆపుతుంది. ఇది చాలా కీలకమైనది.
👉ఎందుకంటే కొందరిలో ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించకపోయినా సరే వారి ద్వారా కరోనా వైరస్ వ్యాపించగలదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాస్కు వేసుకుంటే కోవిడ్ వైరస్ తనకు సోకకుండా మాస్కు రక్షణనిస్తుంది.
💥మాస్కు ఎప్పుడు ఉపయోగించాలి?
👉కరోనాకు మన దగ్గరలో వున్నవారికి, మన కాలనీ వాసులకు వచ్చినప్పుడు మాస్కు ధరించడం మామూలే. కేవలం మనకు నచ్చినపుడు మాత్రమే మాస్కు వేసుకోవడం సరిపోదు.
👉మనం అజాగ్రత్తగా ఉన్న ఒక్క సందర్బం చాలు మనం వైరస్ బారిన పడడానికి. కాబట్టి ఈ క్రింది సందర్భాలలో మాస్కు విధిగా ధరించడం మర్చిపోవద్దు.
👉* ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు.
👉* రద్దీగా ఉన్న ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు
👉* స్నేహితులు, బంధువులను సరదాగా కలిసినపుడు
👉* ప్రార్థనా స్థలాలు, బజారులో* ఆసుపత్రుల దగ్గరకు వెళ్లినపుడు
👉* పనిచేసే ప్రాంతంలో, తోటి ఉద్యోగులతో ఉన్నపుడు
👉* బ్యాంకు, పోస్టాఫీసు వంటి చోట్ల
👉* మనం ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నపుడు మాస్కు ధరించాలి.
👉* ఇంట్లోనే ఎవరైనా కుటుంబ సభ్యులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నపుడు మాస్క్ వాడాలి.
👉*మనకు సమీపంలో ఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తిని గానీ, ఆ లక్షణాలు ఉన్నవారిని కలిసినపుడు మాస్క్ తప్పనిసరి.
👉* కోవిడ్ బారినపడిన వ్యక్తి గానీ, ఆ లక్షణాలు ఉన్నవారికి గానీ సంరక్షణ అందించవలసి వచ్చినపుడు మాస్కు ధరించడం చేయాలి.
💥ఎటువంటి మాస్కు వేసుకోవాలి?
👉సాధారణంగా ప్రజలు నాణ్యమైన వస్త్రంతో తయారు చేసిన మూడు పొరల మాస్కును ధరించడం అనుకూలంగా ఉంటుంది.
👉కోవిడ్-19 సోకినవారు మరియు వారి సంరక్షకులకు మాత్రం ఎన్-95 లేదా ఎన్-99 వంటి ప్రత్యేక మాస్కుల అవసరం ఉంటుంది.
👉కోవిడ్ నుంచి రక్షణ కోసం మూడు పొరలతో ఉన్న నాణ్యమైన దళసరి కాటన్ వస్త్రంతో చేసిన మాస్కు ఉపయోగించడం మంచిది.
👉బయటి పొర నైలాన్ లేదా పాలిస్టర్ వస్త్రం, లోపలి పొర గాలి పీల్చుకునే స్వభావం ఉన్న కాటన్ అయితే మంచిది. ఆ మాస్కు నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పేలా, ముఖానికి మరియు మాస్కుకి మధ్యలో ఖాళీ లేకుండా సరిపోయేలా ఉండాలి.
👉సింథటిక్ లేదా పలుచటి వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ఉపయోగించవచ్చు. వాల్వ్ లేదా కవాటాలు ఉన్న మాస్కులు సాధారణ ప్రజలకు అవసరం లేదు. వాటి ద్వారా రక్షణ తక్కువ.
🙏🙏🙏
Social Plugin